: కేసీఆర్ తడి గుడ్డతో గొంతు కోశారు: సునీల్ రెడ్డి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో ఆయన తన గొంతు కోశారని ఆ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మంథనిలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమంలో అన్ని విధాలుగా ఉపయోగించుకుని, ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని అన్నారు.
కేసీఆర్ సూచనల మేరకు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ వివేక్ ప్రకటించిన తరువాత కేసీఆర్ మరొకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సీట్లు కేటాయించి, తనను జెడ్పీటీసీగా ఉండమనడం సమంజసమా? అని సునీల్ రెడ్డి ప్రశ్నించారు.