: మూడు రాష్ట్రాల నుంచి శివసేన పోటీ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శివసేన ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలనుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ముంబైలో శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ఉత్తరప్రదేశ్ లో ఇంకా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. శివసేనను ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలనుకుంటున్నామని, అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లో 20, బీహార్ లో ఐదు, ఢిల్లీలో 7 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు శివసేన తెలిపింది.