: పార్టీ టిక్కెట్లు అమ్మ జూపిన ఇద్దరు ఏఏపీ సభ్యుల బహిష్కరణ


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సభ్యులను పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు కొంతమందికి డబ్బులకు టిక్కెట్లు అమ్మేందుకు ప్రయత్నించిన అరుణ సింగ్, మరొక వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు చెల్లిస్తే టిక్కెట్ ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే, ఈ ఘటనపై చర్చలు మాత్రమే జరిగాయని వెంటనే పార్టీ తరపున స్పందించినట్లు వివరించారు. అంతేగాక ఏ అభ్యర్థిపైన అయినా విశ్వసనీయ ఆరోపణలు వస్తే తక్షణమే వారి పార్టీ టిక్కెట్ రద్దు చేస్తామని కేజ్రీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News