: ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళంగా వెబ్ సైట్
లోక్ సభ ఎన్నికల సమరం. ధన ప్రభావంతో కూడిన ఈ ఎన్నికల ఆటలో గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖర్చు పెట్టేందుకు తనవంతు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ రెండు పెయిడ్ విందులు నిర్వహించారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రవాస భారతీయులు, ఆ పార్టీ అభిమానులు కొందరు తమ వంతు విరాళంగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను డెవలప్ చేసి చదివించారు. http://my.aamaadmiparty.org/ దీనిని హోలీ రోజున ప్రారంభించగా తొలిరోజే 55లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయట. దీని ద్వారా మరింత మంది మద్దతును పొందే అవకాశం ఆమ్ ఆద్మీకి ఉంటుందని వెబ్ సైట్ రూపకర్తల్లో ఒకరైన ప్రాణ్ కురుప్ తెలిపారు.