: భూవివాదంలో అమీర్ ఖాన్ దూకుడు!


ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో తన స్థలానికి ఇరువైపులా ఉన్న భూమిని కొనుగోలు చేసే విషయంలో బాలీవుడ్ హీర్ అమీర్ ఖాన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్థలాలను తనకు అమ్మాల్సిందేనని అమీర్ తమపై ఒత్తిడి తెస్తున్నట్టు ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆ స్థలాల్లో భారీ భవన సముదాయ నిర్మాణం కోసం ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ భారీ మొత్తంతో బిడ్ దాఖలు చేసింది. అయితే, అమీర్ తన సొంత భవంతి కోసం ఆ కంపెనీ బిడ్ కంటే అధిక మొత్తంతో బిడ్ వేసినట్టు సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఈ వ్యవహారంలో అమీర్ వైఖరిపై విమర్శలు వినవస్తున్నాయి.

  • Loading...

More Telugu News