: టీమిండియాను చుట్టేసి...బౌలర్లను బాదేందుకు అఫ్రిది చాలు: హఫీజ్
పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఒక్కడు రాణిస్తే చాలని, టీమిండియాను చుట్టేస్తామని పాకిస్థాన్ కెప్టెన్ హఫీజ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఢాకాలో ఆయన మాట్లాడుతూ, చరిత్ర పాకిస్థాన్ కి అనుకూలంగా లేకున్నా, ఈసారి చరిత్ర సృష్టిస్తామని తెలిపాడు. ఆసియా కప్ లో తను చూపిన ప్రదర్శన అఫ్రిది ఇక్కడ కూడా చూపుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీమిండియా బ్యాట్స్ మన్ ను తిప్పేసి, భారత బౌలర్ల భరతం పట్టడానికి అఫ్రిది సిద్ధంగా ఉన్నాడని హఫీజ్ హెచ్చరించాడు.