: సీమాంధ్రను అభివృద్ధి చేసే సామర్థ్యం నాకే ఉంది: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం, అధికారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధీమాతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తనకే వున్నాయని చెప్పారు. తానెప్పుడూ ప్రజలకోసమే పనిచేశానని చెప్పిన బాబు... ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత కూడా తనకే దక్కుతుందన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగుజాతికి సేవ చేయాలనే ఆలోచనతో వదులుకున్నానని తెలిపారు. ఈ మేరకు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల మనోభావాల ప్రకారం పార్టీ కార్యకర్తలు పని చేస్తారన్నారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ దెబ్బ తినడం తథ్యమని, అటు వైఎస్సార్సీపీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.