: డొక్కాను కూడా టీడీపీలోకి తీసుకొస్తా:రాయపాటి
కాంగ్రెస్ బహిష్కృత గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 26న ఆయన టీడీపీలోకి వస్తున్నారు. తనతో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని రాయపాటి చంద్రబాబుకు తెలిపారు. డొక్కా తనకు సోదరుడిలాంటి వాడని రాయపాటి చెప్పారు.