: అరటిపండు వొలిచినట్లు అడ్రస్ చెప్పే గూగుల్ మ్యాప్స్
కొత్త ప్రాంతానికి వెళ్లాం. ఏమీ అర్థం కావడం లేదు. ఎటు వెళితే ఏమొస్తుంది? వెళ్లాల్సిన మార్గం ఏ వైపు ఉంది. ఎంత దూరం నడచి వెళితే ఎంత సమయం పడుతుంది? బైక్ మీద వెళితే లేక కారులో వెళితే పట్టే సమయం ఎంత? ఒకరిని అడగకుండానే అడ్రస్ ను అరటి పండు వొలిచినంత తేలిగ్గా చెప్పేలా గూగుల్ డెస్క్ టాప్ మ్యాప్స్ టూల్ ను విడుదల చేసింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయి వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని టూల్ లో టైప్ చేస్తే సరి.. ఇక అక్కడి నుంచి బ్లూ రంగులో మార్గదర్శనం చేస్తూ అదే తీసుకెళుతుంది. ఇప్పటి వరకు రూట్ చెప్పడం వరకే పరిమితమైన గూగుల్ మ్యాప్స్ ఇకపై సమయాన్ని కూడా చెప్పేస్తాయన్నమాట.