: అసలు హోలీ ఎలా మొదలైంది?
జీవితానికి అనుబంధాల రంగులద్దే వేడుకే హోలీ. మిత్రులు, తోటి వారితో కలిసి రంగులు చిమ్ముకునే ఈ వేడుకతో కొత్త అత్మీయత అంటుకడుతుంది. అనుబంధాలు బలపడతాయి. జీవితాన్ని రంగులలో ముంచేసే హోలీ అసలు ఎలా మొదలైంది అన్న ఆసక్తి సహజంగానే ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
హిరణ్యకశిపుడు తెలుసుగా! భక్త ప్రహ్లాద సినిమా చూసిన వారికి గుర్తొచ్చే ఉంటుంది. తన రాజ్యంలో తననే పూజించాలనుకునే ఈ రాక్షస రాజు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడిని స్మరిస్తుంటాడు. నారాయణ మంత్రాన్ని విడవమని ఎన్నిసార్లు చెప్పినా వినడు. చివరికి కొడుకన్న కనికరం కూడా లేకుండా ప్రహ్లాదుడుని చంపమని ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రతీ యత్నంలోనూ నారాయణుడే ప్రహ్లాదుడిని కాపాడుతుంటాడు.
ఇక చేసేదేమీ లేక చివరికి తన చెల్లెలు హోలికను ...ప్రహ్లాదుడుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటలలో వెళ్లమని కోరతాడు. హోలికను అగ్ని దహించకుండా ఒక వరం ఉంది. అందుకే హిరణ్యకశిపుడు అలా కోరతాడు. అన్న చెప్పినట్లుగా ప్రహ్లాదుడిని తీసుకుని హోలిక మంటలలోకి వెళుతుంది.
హోలిక అగ్నికి దహనమైపోగా.. ప్రహ్లాదుడిని మాత్రం నారాయణుడు మరోసారి రక్షిస్తాడు. హోలిక ఒంటరిగా ఉంటేనే అగ్ని ఏమీ చేయలేదు. కానీ, తనతో ప్రహ్లాదుడు కూడా ఉండడంతో ఆమె మరణించింది. హోలిక పేరునే హోలీ ప్రారంభమైందని చెబుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను చేసుకోవడం మొదలైంది.
హోలిక అగ్నికి దహనమైపోగా.. ప్రహ్లాదుడిని మాత్రం నారాయణుడు మరోసారి రక్షిస్తాడు. హోలిక ఒంటరిగా ఉంటేనే అగ్ని ఏమీ చేయలేదు. కానీ, తనతో ప్రహ్లాదుడు కూడా ఉండడంతో ఆమె మరణించింది. హోలిక పేరునే హోలీ ప్రారంభమైందని చెబుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను చేసుకోవడం మొదలైంది.
మరో కథనం ప్రకారం, శివ పార్వతులను ఒక్కటి చేయాలని కాముడు అనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే శివుడిపై ప్రేమ బాణాన్ని ప్రయోగిస్తాడు. తపస్సు భగ్నం కావడంతో శివుడి ఆగ్రహానికి కాముడు మాడి మసైపోతాడు. తన భర్తను ఎలాగైనా బతికించాలని కాముడి భార్య రతీదేవి శివుడిని అర్ధిస్తుంది. దీంతో ఆమెకు మాత్రమే అతడు కనిపించేలా శివుడు వరమిచ్చింది , ఫాల్గుణ పౌర్ణమి నాడేనని చెబుతారు. అందుకే కామదహనం చేయడం హోలీ పండుగకు ముందు కనిపిస్తుంది. ఇలాగే మరికొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి.