: అభ్యర్థులు దొరకని మాట నిజమే: కిల్లి కృపారాణి


కాంగ్రెస్ పై సీమాంధ్ర ప్రజలు ఆవేశంతో ఉన్న మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అంగీకరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా దొరకలేదని తెలిపారు. అయితే తాము చేపడుతున్న బస్సు యాత్రలో సీమాంధ్ర ప్రజలకు అన్ని విషయాలను వివరించి వాస్తవాలను తెలియజేస్తామని చెప్పారు. ఇతర పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజల మనసును మారుస్తున్నాయని ఆరోపించారు. ఈ రోజు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదు, పదేళ్లలో సీమాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News