: అజ్జూభాయ్ కి 'లోకల్' సెగ


భారత జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ ఎంపీ అజహరుద్దీన్ కు రాజస్థాన్ లోని టోంక్-సవాయ్ మధోపూర్ నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపిన అజ్జూకు కాంగ్రెస్ పార్టీ మధోపూర్ లోక్ సభ స్థానం కేటాయించింది. అయితే, అక్కడ ఈ మాజీ కెప్టెన్ కు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలతో స్వాగతం పలికాయి. స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలంటూ వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

బయటి నుంచి వచ్చిన వ్యక్తి తమకొద్దని స్థానిక కార్యకర్తలు అంటుండడంతో అజర్ విజయంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కాంగ్రెస్ హైకమాండ్ అజ్జూకి మధోపూర్ నియోజకవర్గాన్ని కేటాయించింది. దీనిపై ఈ మాజీ క్రికెటర్ స్పందిస్తూ, పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. ఇక్కడి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News