: నేను ఎన్నికల్లో పోటీ చేయడమేంటి... నాన్సెన్స్!: సెహ్వాగ్


తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు వచ్చిన వార్తలను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖండించాడు. కాంగ్రెస్ టికెట్ పై తాను పోటీ చేయనున్నట్టు మీడియాలో కథనం రాగా, దానిపై ట్విట్టర్ లో స్పందించాడు. తనకలాంటి ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశాడు. మీడియాలో ఎందుకు ఇలాంటి కథనాలు వస్తున్నాయో అర్థంకావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఢిల్లీలో ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు ఓకే చెప్పిన కాంగ్రెస్ అధిష్ఠానం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడన్న కథనాలు వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News