: తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది: పొన్నాల
హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారు నివసిస్తున్నారని... వాళ్ల భద్రతకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని టీపీసీసీ చీఫ్ పొన్నాల తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని... ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.