: మరో రూ.62వేల కోట్ల ఉద్దీపనాలకు అమెరికా కోత


భారత్ వంటి వర్ధమాన దేశాలకు రుచించని విధంగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్(కేంద్ర బ్యాంకు) మరో 10 బిలియన్ డాలర్ల(రూ.62వేల కోట్లు) ఉద్దీపనాలకు కోత విధించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2008లో అమెరికాలో ఇళ్ల మార్కెట్ కూలిపోవడంతో అదే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి, మార్కెట్లో నిధుల సరఫరాను పెంచేందుకు ఫెడ్ నెలవారీ బాండ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి నెలకు 8,500కోట్ల బిలియన్ డాలర్ల మేర బాండ్లను కొనుగోలు చేస్తూ వస్తోంది.

ఈ మొత్తాన్ని గతేడాది చివరి నుంచి క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. ఇకపై నెలవారీ 5,500కోట్ల డాలర్ల మేరే ఉద్దీపనాలపై ఖర్చు చేయనున్నట్లు ఫెడ్ నుంచి ప్రకటన వెలువడింది. ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్ పర్సన్ జానెత్ యెల్లెన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యమే పరిస్థితి మెరుగుపడడానికి దోహదం చేస్తుందని ఫెడ్ ప్రకటించింది. జాబ్ మార్కెట్ కుదురుకునే వరకూ వడ్డీ రేట్లను పెంచబోమని యెల్లెన్ తెలిపారు.

  • Loading...

More Telugu News