: నామినేషన్ వేయండి... 3లక్షలు తీసుకెళ్లండి: మంత్రి గారి బంపర్ ఆఫర్


సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయింది. మున్నిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. దీంతో పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి ప్రాదేశిక నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడాలని స్థానిక నేతలను అభ్యర్థిస్తున్నారు. అందుకు ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో, పనిలో పనిగా 'బీ ఫారం తీసుకెళ్లండి... 3 లక్షల రూపాయలు నజరానాగా అందుకోండి' అని బంపరాఫర్ ప్రకటించేశారు.

అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతకు తార్కాణంగా నిలుస్తోంది. వంగరలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేటి సాయంత్రంతో నామినేషన్లకు గడువు ముగియనుంది.

  • Loading...

More Telugu News