: దాల్మియా కేసులో శ్రీలక్ష్మి విచారణకు అనుమతి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని దాల్మియా వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ శర్మ సీబీఐకి లేఖ రాశారు. ఈ కేసులో ఐదవ నిందితురాలుగా ఉన్న శ్రీలక్ష్మి మరోవైపు ఓఎంసీ కేసులోనూ నిందితురాలిగా ఉన్నారు. జగన్ కేసులో అరెస్టయిన నిందితులందరూ గతేడాది బెయిల్ పై విడుదలవ్వగా అనారోగ్య కారణాలతో శ్రీలక్ష్మి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.