: శ్రీవారి ఆలయానికి 3 కి.మీ. దూరం వరకు వ్యాపించిన మంటలు


తిరుమల చుట్టూ ఉన్న శేషాచలం అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, మంటలు శ్రీవారి ఆలయానికి 3 కి.మీ. దూరం వరకు వ్యాపించాయి. అయితే, అవి ఆలయం దిశగా మరింత ముందుకు రాకుండా ఫైర్ సిబ్బంది నియంత్రించగలిగారు. గుడివైపు కాకుండా ఇతర ప్రాంతాలపైపు మాత్రం అగ్నికీలలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో, మంటలను అదుపులోకి తేవడానికి నాలుగు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఇవి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నాయి.

  • Loading...

More Telugu News