: బాబు నిక్కర్లు వేసుకునేసరికే మనం ఐటీ అభివృద్ధి సాధించాం: విజయమ్మ


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఐటీ ఘనత అంతా తనదేనని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. బాబు నిక్కర్లు వేసుకునే సరికే రాష్ట్రం ఐటీ విషయంలో మూడోస్థానంలో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ళ పాలనలో ఉద్యోగాలివ్వని బాబు ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తానని చెబుతున్నారని విజయమ్మ మండిపడ్డారు. ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రుణ మాఫీ చేయలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News