: ధోనీ వచ్చినా తేడా ఏమీ ఉండదంటున్న పాక్ కెప్టెన్
ఇటీవల ఆసియా కప్ లో భారత్ పై సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. ఈ క్రమంలో మాటల యుద్ధానికి తెరదీసింది. ఢాకాలో మీడియాతో మాట్లాడుతూ, ధోనీ జట్టులోకి వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండబోదని పాక్ టీ20 సారథి మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యానించాడు. నాయకత్వ లక్షణాల రీత్యా ధోనీ రాక భారత కు కీలకమేమోగానీ, తాము మాత్రం ఆసియా కప్ లో అతడు లేకపోబట్టే గెలిచామన్న మైండ్ సెట్ తో బరిలో దిగబోమని హఫీజ్ స్పష్టం చేశాడు.