: మోడీ పీహెచ్ డీ విద్యార్థిలా ఫోజు కొడుతున్నాడు: ఖుర్షీద్
విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మరోమారు విరుచుకుపడ్డారు. మోడీ తానో పీహెచ్ డీ విద్యార్థిననుకుంటున్నారు కానీ, ఆయన ఇంకా నర్సరీ విద్యార్థిలాంటి వాడేనని అభిప్రాయపడ్డారు. 2002 అల్లర్ల వ్యవహారంలో క్లీన్ చిట్ లభించడంపై మోడీ స్పందన మంచి మార్కులు వచ్చిన నర్సరీ విద్యార్థిలానే ఉందని ఖుర్షీద్ ఎద్దేవా చేశారు. ఖుర్షీద్ ఇంతకుముందు కూడా మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'మోడీ ఓ నపుంసకుడు' అని పేర్కొని సొంతపార్టీలోనూ విమర్శలపాలయ్యారు. ఇలాంటి పదజాలాన్ని తాను ప్రోత్సహించనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.