: టీడీపీతో పవన్ గ్రౌండ్ అలయెన్స్


రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలసి పని చేయనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీలు సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా ప్రారంభించాయి. అయితే, మరి పవన్ మాటేమిటి? జనశక్తి ఎన్ని సీట్లలో పోటీ చేయనుంది? ఇప్పుడు అందర్లోనూ ఇవే ప్రశ్నలు. అయితే, పవన్ మదిలో మాత్రం స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఇప్పటికే ఆయన చంద్రబాబు ముందు ఉంచారని తెలుస్తోంది. తన మదిలోని ఆలోచనలకు ఓకే చెబితే... ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేస్తానని చంద్రబాబుకు చెప్పారు.

ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని... కానీ, సీమాంధ్రలో ఇకపై అన్ని ప్రాంతాలను ఒకే విధంగా డెవలప్ చేయాలని చంద్రబాబుకు పవన్ చెప్పారు. అంతేకాకుండా, యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా... వారికి స్వయం ఉపాధి పథకాలను చేపట్టాలని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనికి ఆమోదం తెలిపితే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున సీమాంధ్రతో పాటు, తెలంగాణలో కూడా పవన్ ప్రచారం చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పవన్ చెప్పిన వాటన్నిటికీ ఓకే చెప్పిన చంద్రబాబు ఓ విషయంలో మాత్రం విభేదిస్తున్నట్టు సమాచారం. తన సహచరుడు, నిర్మాత అయిన పొట్లూరి వరప్రసాద్ కు విజయవాడ లోక్ సభ సీటును కేటాయించాలని పవన్ అడుగుతున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News