: మచిలీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో 161 నామినేషన్లు
మచిలీపట్నం పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియలో ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. మచిలీపట్నం మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా తొలుత 285 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో 21 తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణ గడువు పూర్తయ్యే సమయానికి... 103 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. చివరకు ఎన్నికల బరిలో 161 మంది పోటీలో నిలిచారు. పార్టీల అభ్యర్థులకు వారి చిహ్నాలు కేటాయిస్తామని, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యతను అనుసరించి గుర్తులు కేటాయించనున్నట్టు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్ చెప్పారు.