: మలేషియా విమాన శోధనను నిలిపేసిన అమెరికా యుద్ధ నౌక


మలేషియా విమానం ఎం.హెచ్.370 ఆచూకీ తెలియక సరిగ్గా 11 రోజులైంది. ఈ విమానం కోసం కొనసాగుతున్న శోధనలో పాల్గొన్న అమెరికా యుద్ధ నౌక ప్రస్తుతం ఆ పనిని నిలిపివేసినట్లు యుఎస్ మిలటరీ అధికారులు తెలిపారు. నేవీ పి-3, పి-8 నిఘా విమానాలు మాత్రం వెదుకుతున్నాయని, గగనతల శోధన కోసం వీటికి అధునాతన రాడార్లు అమర్చి ఉన్నాయని, శకలాలను గుర్తించేందుకు వీలుగా తక్కువ ఎత్తులోనూ ఎగరగలవని తెలిపారు. తాజా నిర్ణయాలపై మలేషియా ప్రభుత్వంతో చర్చించామని చెప్పారు. గల్లంతైన విమానాన్ని కనుగొనేందుకు అమెరికా ధృడ నిశ్చయంతో ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి అన్నారు.

  • Loading...

More Telugu News