: సంచలన విషయాలు బయటపెడతా: మోహన్ బాబు
సంచలన విషయాలు బయటపెడతానని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, మద్యానికి, కరెన్సీ నోట్లకు, బిర్యానీ పొట్లానికి ప్రజలు అమ్ముడుపోకుండా ఉంటే రాష్ట్రంలో మంచి నాయకత్వం ఉంటుందని అభిప్రాయపడ్డారు. భయపడకుండా, నిజయతీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని ఆయన స్పష్టం చేశారు. దేశం బాగు పడాలా? భ్రష్టు పట్టాలా? అనేది యువత చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు.