: కష్టాల నుంచి గట్టెక్కించగల సత్తా మోడీకే ఉంది: వెంకయ్యనాయుడు
సుపరిపాలన అందించగల నేత మోడీయేనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అమెరికా, యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు మోడీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు మోడీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రికార్డు స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
భారత దేశానికి మోడీ శ్రీరామ రక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే బీజేపీ విజయం సాధించాలని ఆయన అన్నారు. మోడీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. ఎవరు విశ్వసనీయులుగా ఉంటారు?, సమర్థులెవరు?, గెలిచే అవకాశం ఎవరికి ఉంది? అనే అంశాలను ప్రజలు చూడాలని ఆయన సూచించారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే బీజేపీని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.