: రూ.1246 కోట్లకు జీవిత బీమా తీసుకున్న అమెరికా వాసి


సామాన్యుడు ఓ లక్షో, రెండు లక్షల రూపాయలకో జీవిత బీమా పాలసీ తీసుకోవడానికి పరిమితమవుతాడు. అందుకోసమే ఏటా వేల రూపాయలు ప్రీమియంగా కట్టాల్సి ఉంటుంది. మరి ఆయన అమెరికాలో సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ ప్రముఖ బిలియనీర్ (వంద కోట్లకు పైబడి సంపద కలిగినవారు). అందుకే తన ప్రాణం విలువకు భారీగా వెలకట్టాడు. లక్షో, కోటి రూపాయలో కాదు.. ఏకంగా 1246 కోట్ల రూపాయలకు (20.1కోట్ల డాలర్లు) జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. మానవ చరిత్రలో ఇంత భారీ మొత్తానికి జీవిత బీమా పాలసీ ఇంతవరకూ ఎవరూ తీసుకోలేదట. అంటే ఇదో గిన్నిస్ రికార్డు అన్నమాట. లోగడ 1990లో 10కోట్ల డాలర్ల మొత్తానికి ఓ అమెరికన్ తీసుకున్న జీవిత బీమా పాలసీనే అతి ఖరీదైనదిగా ఇప్పటి వరకు రికార్డుల్లో ఉంది.

  • Loading...

More Telugu News