: దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాటమార్చారు: వీహెచ్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్... తెలంగాణ వచ్చిన వెంటనే మాట మార్చారని ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటున్న చంద్రబాబు... ఈ ప్రకటన ఇంతకు ముందు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని... బీసీని కాని, ఎస్సీని కాని సీఎం చేయగలిగిన సత్తా కాంగ్రెస్ కే ఉందని తెలిపారు. విభజన విషయంలో అన్ని పార్టీలు మాట మార్చాయని అన్నారు. సమైక్యవాదినంటూ కిరణ్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News