: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కర్రి సీతారాం


కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ప్రథమ శ్రేణి నాయకులు సురక్షితమైన పార్టీల్లో స్థానాలను ఖరారు చేయించుకుని వివిధ పార్టీల్లో చేరుతుండగా, ద్వితీయ శ్రేణి నేతలు కూడా కాంగ్రెస్ కు దూరమవుతున్నారు. తాజాగా భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. భీమిలిలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో మరో రెండ్రోజుల్లో పార్టీ సభ్యత్వం పుచ్చుకోనున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News