: బీజేపీ మతతత్వ పార్టీ అంటూ త్రిపురలో పాఠ్యాంశం
బీజేపీ మతతత్వ పార్టీ అంటూ త్రిపురలో 9వ తరగతి పుస్తకాల్లో ఒక పాఠ్యాంశం వెలుగు చూడడం వివాదానికి దారి తీస్తోంది. ఈ విషయమై బీజేపీ నేత ప్రసేన్ జిత్ భారత ఎన్నికల ప్రధాన అధికారి సంపత్ కు ఫిర్యాదు చేశారు. బెంగాలీ మీడియం పొలిటికల్ సైన్స్ పుస్తకంలో భారత్ లో పార్టీల విధానం అన్న పాఠంలో బీజేపీ, ముస్లింలీగ్, హిందూ మహాసభ తదితర పార్టీలను చేర్చారంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, విద్యాశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని త్రిపుర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అశుతోష్ జిందాల్ చెప్పారు.