: మీడియాకు వర్క్ షాప్ నిర్వహించనున్న ఎన్నికల సంఘం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా వర్క్ షాప్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న జూబ్లీ హాల్ లో మీడియా ప్రతినిధులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళితో పాటు పెయిడ్ న్యూస్ అంశంపైనా ఈ కార్యశాలలో చర్చిస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల సంఘం డైరక్టర్ అక్షయ్ రౌత్ హాజరవుతారు.