: డీఎంకేలో కొందరు మా నాన్నను వేధిస్తున్నారు: కరుణానిధి తనయుడు
డీఎంకే పార్టీలోని కొందరు వ్యక్తులు తన తండ్రి కరుణానిధిని వేధిస్తున్నారని, పార్టీ అధ్యక్షుడైనా సరే ఆయన విధులకు అడ్డుతగులుతున్నారని బహిష్కృత నేత అళగిరి ఆరోపించారు. మధురైలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా సోదరుడు స్టాలిన్ ను ఉద్దేశించే అళగిరి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అళగిరిపై డీఎంకే వేటు వేసిన సంగతి తెలిసిందే.