: యువ నాయకుల వైపు జగన్ పార్టీ చూపు
పాతకాపుల కంటే తాజాదనం ఉట్టిపడే యువతను ఎన్నికల బరిలో దింపాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పతనం దిశగా సాగుతుండగా, ఆ పార్టీలోని నేతలందరూ టీడీపీ బాట పడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ తాను టీడీపీకి గట్టిపోటీ ఇవ్వాలంటే యువతకు పెద్దపీట వేయడమే మార్గమని తలపోస్తోంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఔత్సాహిక యువ నాయకుల, మాజీ అధికారులతో ఓ జాబితాను రూపొందించినట్టు సమాచారం.
జగన్ పార్టీ తరపున అరకు (వి. గీత), అనకాపల్లి (జి.అమర్ నాథ్), ఒంగోలు (బి.సురేశ్ రెడ్డి), తిరుపతి (వరప్రసాద్), కర్నూలు (బి.రేణుక) వంటి స్థానాల్లో బరిలో ఉన్నది కూడా యువ నేతలే. ఈ నేపథ్యంలో మరిన్ని స్థానాలను యువతకు కేటాయించడం ద్వారా సీమాంధ్రలో సత్తా చాటాలన్నది వైఎస్సార్సీపీ వ్యూహంగా కనిపిస్తోంది.