: కేజ్రీవాల్ కు అంత సీన్ లేదు: హరీష్ ఖురానా


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అంత సీన్ లేదని బీజేపీ మీడియా కన్వీనర్ హరీష్ ఖురానా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ ను తాము సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు. వారణాసిలో కేజ్రీవాల్ నుంచి మోడీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కనీసం 40 రోజులు మంచి పాలన అందించలేకపోయారని కేజ్రీవాల్ ను ఎద్దేవా చేశారు. మోడీని దేశమంతా స్వాగతిస్తోందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News