: మలేషియా విమానం కోసం వెతుకులాట నిలిపివేత


కనిపించకుండా పోయిన మలేషియా విమానం ఎంహెచ్-370 కోసం చేపట్టిన గాలింపు చర్యలను భారత్ నిలిపివేసింది. ఈ విమానాన్ని వెతకడం కోసం ఉద్దేశించిన వ్యవస్థలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. విమానం కోసం చేపట్టిన దర్యాప్తు ఆధారంగా కొనసాగుతున్న శోధన కొత్త దశలోకి ప్రవేశించినట్లు మలేషియా అధికారులు పేర్కొన్నందున, శోధనలోనూ కొత్త వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుందని భారత రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు భారత్ వైపు నుంచి కొనసాగుతున్న వెతుకులాటను తాత్కాలికంగా నిలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News