: వాహన తనిఖీల్లో ఒక్కరోజే రూ. 1.93 కోట్లు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో కోటి 93 లక్షల 51 వేల రూపాయలు పట్టుబడ్డాయి. హైదరాబాదు బేగంబజార్ పోలీసులు బైక్ లపై తరలిస్తున్న రూ. 51.46 లక్షలు, మహేశ్వరం సమీపంలో 1.75 లక్షలు, జీడిమెట్లలో 19 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 4.55 లక్షలు, నల్లగొండ జిల్లాలో 4.45 లక్షలు, ఆదిలాబాదులో 1.18 లక్షల రూపాయలను పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షలు, విజయనగరం జిల్లాలో 2.50 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ. 1.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విశాఖపట్నంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7,056 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.