: ‘జన సేన’ రూ.250 కోట్లు ఖర్చు పెట్టింది!


సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ ప్రారంభోత్సవ ఖర్చుపై విచారణ జరపాలని న్యాయవాది బద్ధం నర్సింహారెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారని, వివిధ ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో హెచ్ఐసీసీలో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారని, దీనికి సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన ఆరోపించారు. జనసేన పార్టీపై నర్సింహారెడ్డి చేసిన ఫిర్యాదును ఆదాయపు పన్ను శాఖకు పంపనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆ పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలియదని, అటువంటప్పడు దీనిపై తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి.

  • Loading...

More Telugu News