: టీడీపీలో చేరిన రాజంపేట కాంగ్రెస్ ఇన్ ఛార్జ్
సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు రాజంపేట టీడీపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రను సింగపూర్ లా మార్చేది చంద్రబాబే అని కితాబిచ్చారు.