: బాబా నోట మళ్లీ మోడీ జపం
యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జపం చేశారు. దేశంలో ఎక్కడ చూసినా నరేంద్రుడి పవనాలేనన్నారు. కాంగ్రెస్ గత 65 ఏళ్లుగా ఈ దేశాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనంపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలిపిందన్నారు. రెండు రోజుల క్రితమే.. ఎన్డీయేకి మద్దతుపై పునరాలోచన చేయనున్నట్లు రాందేవ్ బాబా ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తం దెబ్బతిందేమో గానీ, అప్పుడే మాట మార్చేసి మళ్లీ మోడీకి జై అంటున్నారు.