: టీఆర్ఎస్ తో పొత్తు గురించి మేమెన్నడూ ఆలోచించలేదు: పొన్నాల
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని చెప్పింది కేసీఆరే అని చెప్పారు. మాట తప్పడం మోసం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని తాము ఎన్నడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.