: ఆ నిర్ణయం వారే తీసుకోవాలి: గంగూలీ


రిటైరైన క్రికెటర్లు తమ నైపుణ్యాలను టీమిండియా కోసం ఉపయోగించాలనంటున్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అయితే, మాజీలు ఎవరికి వారే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇటీవలే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ పదవి చేపట్టాలని సూచించడం తెలిసిందే. దీనిపై గంగూలీ స్పందించాడు. 'మనకు సచిన్, ద్రావిడ్, కుంబ్లే వంటి అద్భుతమైన క్రికెటర్లున్నారు. టీమిండియాకు సేవలు అందించే విషయమై ఎంత సమయం కేటాయిస్తారన్న దానిపై వారే ఓ నిర్ణయం తీసుకోవాలి' అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News