: పవన్ లో భావోద్రేకం ఎక్కువ: చిరంజీవి


జనసేన పార్టీ విషయంలో తాను ఇంతవరకు పవన్ తో మాట్లాడలేదని చిరంజీవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 125 ఏళ్ల చరిత్ర ఉందని... అలాంటి పార్టీని నిందించడం సరికాదని అన్నారు. స్వతహాగా పవన్ లో భావోద్రేకం ఎక్కువని తెలిపారు. అయితే, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన తమ్ముడిలో కనిపించిందని అన్నారు. పార్టీలు ఎవరైనా పెట్టొచ్చని... ఆ హక్కు పవన్ కు కూడా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరును పవన్ తప్పుబట్టారని... అన్ని పార్టీల నిర్ణయం తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చిరంజీవి తెలిపారు.

  • Loading...

More Telugu News