: పవన్ కల్యాణ్ నోటి దురదతోనే పార్టీ పెట్టారు: ఆనం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ హఠావో, దేశ్ బజావో అన్న పిలుపుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నోటి దురదతోనే పార్టీ పెట్టాడని అన్నారు. నోటి దురద తీరిపోయిందని, రేపట్నుంచి షూటింగ్ లకు వెళ్లిపోతారని ఆయన తెలిపారు.