: ఆఖరి రోజూ.. అదేతీరు...


శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల తీరు మారటంలేదు. రోజూ లాగే ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలివ్వడం, వాటిని స్పీకర్ తిరస్కరించడం.. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం.. బడ్జెట్ సమావేశాలకు ముగింపు రోజైన ఇవాళా అసెంబ్లీలో ఇదే చిత్రం పునరావృతం అయింది. 

విద్యుత్తు సమస్య మీద వామపక్షాలు, తెలంగాణ అంశంపై టీఆర్ఎస్.. బీజేపీ, రైతాంగ సమస్యలమీద వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానాలిచ్చాయి. వీటిని స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.   దీంతో స్పీకర్ సభను 10 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా విపక్షాలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నాయి.  

  • Loading...

More Telugu News