: పవన్ ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్


జనసేన పార్టీ స్థాపించిన మరుసటి రోజుకే పవన్ కల్యాణ్ ను ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత మురళీ మోహన్ తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, పవన్ ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పదవుల కోసం కాకుండా దేశానికి సేవ చేయాలనే భావాలు కల వ్యక్తి పవన్ అని ప్రశంసించారు. కాగా, కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ దింపుడు కళ్లెం లాంటిదని.. కాంగ్రెస్ వెంటి లేటర్ లాంటిదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని మురళీమోహన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News