: రాహుల్... ఇందిరలా నడుచుకోవడం నేర్చుకోండి: పవన్
ప్రధాని కావాలని ఆశిస్తున్న రాహుల్ గాంధీ ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీలా నడుచుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు పవన్ కల్యాణ్. గతంలో ఇందిరా గాంధీ సమాచార శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశంలో హిందీ ఉద్యమం నడుస్తోందని, బలవంతంగా హిందీ నేర్చుకోవాలంటూ చాలా చోట్ల ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. అయితే ఆ చర్యలకు ఎన్నో చోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైందని పవన్ చెప్పారు. ఆ సమయంలో ఇందిర చెన్నై వెళ్ళి హిందీ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేయబోమని వివరణ ఇచ్చుకున్నారని, అది ఆమె సంస్కారానికి నిదర్శనమని, ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో రాహుల్ కూడా అలాంటి సంస్కారమే అలవర్చుకోవాలని పవన్ సలహా ఇచ్చారు.