: సమాజం బాగుండాలని కోరుకొనేవాణ్ణి: పవన్ కల్యాణ్
తాను సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అప్పట్లో తనకి లేదన్నారు. తాను కోరుకుంటే అప్పుడే పీఆర్పీ తరపున ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసుండేవాడినని పవన్ చెప్పారు. సమాజంలో జరిగే అన్యాయం, అక్రమాలు భరించలేక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టానని ఆయన తేల్చి చెప్పారు.