: జన సేన పాటలో అసలేముంది?
పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కోసం ప్రచారంలో ఉన్న 'తూర్పు దిక్కు ఎరుపెక్కి' గీతం ఇప్పుడు రాష్ట్రంలో హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో ఓసారి ఆ గీతాన్ని చూద్దాం.
తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడిగే యువశక్తి నిలదీసే హక్కే ఈ జన సేన
నలుగుతున్న జనఘోషకు సమాధానం ఇదంటూ రగులుతున్న విలయాలను సమాధి చేయాలంటూ నరం నరం పెల్లుబికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైంది మరో మహా ప్రస్థానం
తూర్పు దిక్కు..
జనగళమే తన గళమై ఉదయించిన జన సేన జనహితమే తన మతమై కదిలింది జన సేన జన సేన జన సేన జన సేన జన సేన జన సేన జన సేన జన సేన జన సేన
తూర్పు దిక్కు..