: లోపల 'ఆప్' భోజనం రూ.10వేలు... బయట రూ.10!


పాత సీసాలో కొత్త సారాలా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల కోసం చిత్రమైన విద్యలు పోతోంది. 'విరాళమివ్వండి... నాతో కలసి భోజనం చేయండంటూ' అరవింద్ కేజ్రీవాల్ నిన్న రాత్రి మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఖరీదైన విందు సభ పెట్టారు. 10వేల రూపాయలు అంతకంటే ఎక్కువ చందా ఇచ్చిన వారిని తులి ఇంటర్నేషనల్ హోటల్లోపలికి ఆహ్వానించారు. 300 మందికిపైగా ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. కానీ, దీనికి కౌంటర్ గా ఓ ఇద్దరు సామాజిక కార్యకర్తలు అంజు గోల్వ్, సునీల్ రచర్వార్ కేవలం 10 రూపాయలకే సంప్రదాయ భోజనాన్ని వచ్చిన వారికి వడ్డించారు. అదీ ఆమ్ ఆద్మీ విందుసభ జరుగుతున్న హోటల్ బయటే.

అయితే, తాము ఆమ్ ఆద్మీకి వ్యతిరేకం కాదని వీరు స్పష్టం చేశారు. సామాన్య మానవుడు 10 రూపాయలకే భోజనం పొందవచ్చనే సందేశాన్ని తాము ఇస్తున్నామని చెప్పారు. ఎవరూ 10వేల రూపాయలకు డీలక్స్ హోటల్లో భోజనం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరిలో సునీల్ రచర్వార్ ఆమ్ ఆద్మీ వ్యవస్థాపకుల్లో ఒకరు కాగా, మరొకరు అదే పార్టీ కార్యకర్త. కానీ, పార్టీ అనుసరిస్తున్న తీరు వారిని బాధకు గురిచేసిందట.

  • Loading...

More Telugu News