: పవన్ ప్రసంగానికి హైదరాబాదులో ఏడు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ లు


నటుడు పవన్ కల్యాణ్ తను పెట్టబోయే కొత్త పార్టీ ప్రకటనకు ఈ సాయంత్రం ఆరు గంటలకు నోవాటెల్ హోటల్లో భారీ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సమావేశాన్ని అభిమానులు, ప్రజలు చూసేందుకు రాష్ట్రం మొత్తం మీద 30 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాదులో ఏడు చోట్ల స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. మల్కాజ్ గిరి, మేడ్చల్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, బోరబండ ప్రాంతాల్లో ఈ స్క్రీన్ ల ద్వారా పవన్ ప్రసంగాన్ని వీక్షించవచ్చు. అంతేగాక బెంగళూరులోని గాంధీనగర్ లోనూ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News